కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ జిల్లాలో శనివారం భారీ వర్షం కురిసింది. కాగజ్ నగర్ మండలంలో హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రహదారి మల్లింపు చేసి తాత్కాలిక వంతెన నిర్మించారు. భారీ వర్షానికి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. శనివారం నుండి ఈ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
