పోచారం లక్ష్మీపుత్రుడు కాదు లంక పుత్రుడు
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
పోచారం శ్రీనివాస రెడ్డి లక్ష్మి పుత్రుడు కాదు లంక పుత్రుడు గా మారాడు బీఆర్ఎస్ లో పోచారం అన్నీ పదవులు అనుభవించారు.
పోచారం ఆయన కుటుంబ సభ్యులగురించి ఎన్నికల ప్రచారం లో చాలా నీచంగా మాట్లాడారు. పోచారం గురించి అంతలా మాట్లాడిన రేవంత్ ఇపుడు కాంగ్రెస్ లో సిగ్గు లేకుండా చేర్చుకున్నారు.
పోచారం తన నియోజక వర్గానికి 7500 కోట్ల రూపాయల నిధులు తీసుకెళ్లారు.
రాష్ట్రం లోనే అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు కేసీఆర్ బాన్సువాడ కు కేటాయించారు.
కేసీఆర్ రుణం తీర్చుకోలేనిది అన్న పోచారం ఇపుడు పార్టి కి ద్రోహం చేశారు.రైతుల కోసం పోచారం కాంగ్రెస్ లోకి వెళ్ళలేదు ..రాళ్ళ (క్రషర్ )కోసం వెళ్లారు పోచారం కు కేసీఆర్ ఎంతో గౌరవం ఇచ్చారు.దమ్ముంటే పోచారం రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి అనీ డిమాండ్ చేశారు.పార్టీ మారిన వాళ్ళను రాళ్లతో కొట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు .ఆ మాటలు ఎక్కడకు పోయాయి బాన్సువాడ లో ఉప ఎన్నిక తధ్యం .ఎపుడు ఎన్నిక జరిగినా బీ ఆర్ ఎస్ విజయం ఖాయం.
చంద్రబాబు ,కేసీఆర్ లకు ద్రోహం చేసిన పోచారం రేపు రేవంత్ ను కూడా మోసం చేస్తారు.
మాజీ ఎమ్మెల్యే గణేష్ బీగాల
తల్లి పాలు తాగే వాళ్ళు టీ ఆర్ ఎస్ లో ఉంటారు ..డబ్బా పాలు తాగే వాళ్ళు టీడీపీ లో ఉంటారు అని పోచారం గతం లో అన్నారు.
అందరి కన్నా ఎక్కువ లబ్ధి పొందిన పోచారం పార్టీ మారడం దురదృష్టకరం ఆయనకు బీ ఆర్ ఎస్ లో సీనియారిటీ కన్నా వయసు దృష్ట్యా పదవులు లభించాయి
పోచారం చేసిన పనికి ఆయన్ను దేవుడు కూడా క్షమించడు.
పోచారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే
బీఆర్ ఎస్ లో నాయకులకు కొదవ లేదు .తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడే పార్టీ బీ ఆర్ ఎస్ మాత్రమే నలుగురు నాయకులు పోయినంత మాత్రాన బీ ఆర్ ఎస్ కు వచ్చిన నష్టం లేదు మళ్ళీ అధికారం లోకి వచ్చేది బీ ఆర్ ఎస్ మాత్రమే అని గులాబీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
