Saturday, February 21, 2026

పోచారం లక్ష్మీ పుత్రుడే

ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి

కాంగ్రెస్ పార్టీలో చేరికతో మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పై కొంత మంది సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని మొదలు పెట్టారు. పాత వీడియోలను తీసుకు వచ్చి ఇట్టెట్టా చేస్తావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజమే అలా ప్రశ్నించే వారికి వాస్తవాలు తెలియవు. తెలిస్తే ఇలా చేయరు. వాస్తవాలు ఎప్పుడూ వాస్తవాలే. పోచారం ఎప్పుడూ ప్రజల మనిషే. నిజాయతీకి పెట్టింది పేరు అని పోచారం అనుచర గణం ఆరోపిస్తుంది.జరిగింది ఏమిటి..
వాస్తవంలోకి వెళ్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తిరుగులేని నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అనితర సాధ్యమైన అభివృద్ధి ప్రధాత. నిత్యం ప్రజల కోసమే పరితపించే వ్యక్తి. ప్రజల కోసమే బతుకుతున్న నిజమైన, నిఖార్సైన ప్రజా నాయకుడు. ఉన్నట్టుండి అలాంటి నేతకు పార్టీ మారాల్సిన గత్యంతరం ఎందుకు వచ్చింది. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అనుభవించలేని పదవులంటూ ఏమీ లేవు. కష్టపడి పైకి వచ్చిన అతనికి ఎన్నో పదవులు వరించాయి. ముఖ్యమంత్రి కంటే పెద్ద ప్రోటోకాల్ పదవి స్పీకర్ హోదాలోనూ ఆ పదవికి వన్నె తెచ్చింది నిజమే.
తెలంగాణ స్వాప్నికుడిగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వెన్నెంటి ఉంటూ వెన్నుపోటు పొడుస్తున్న నాయకుల తీరు పోచారం బయటకు వెళ్ళేందుకు అసలు కారణం. ఈ వాస్తవం తెలిస్తే అందరూ ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే వేముల ప్రశాంత్ రెడ్డి అనే మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే అందరికి సుపరిచతమే. అదృష్టం కొద్దీ కేవలం రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్న ప్రశాంత్ రెడ్డి చేష్టాలే పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ మారేందుకు కారణం అయ్యి ఉంటుందనేది ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరి ఆలోచనకు తడుతున్నదే.
రోడ్డు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఆత్మగా కొనసాగినటువంటి రమేష్ రెడ్డికి జిల్లా సహకార బ్యాంక్ ఛైర్మన్ గిరి కట్టబెట్టడానికి తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని, తండ్రి లాంటి కేసీఆర్ ను ప్రశాంత్ రెడ్డి వంచించింది నిజం కాదా.
తన ఆత్మ రమేష్ రెడ్డి కి నిజామాబాద్ DCCB చైర్మన్ పదవిని కట్టబెట్టడానికి వెనక నుండి చక్రం తిప్పి డైరెక్టర్లతో అవిశ్వాస పెట్టించి, అన్ని విదాలుగా అండగా ఉన్న తండ్రి లాంటి పోచారం శ్రీనివాసరెడ్డి కి వెన్నుపోటు పొడిచి పోచారం భాస్కర్ రెడ్డిని జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పదవి నుండి తప్పించడానికి తెరవెనుక సహకారం అందించింది ఎవరో జిల్లా ప్రజలు తెలుసుకోవాలి.
రమేష్ రెడ్డిని, ప్రశాంత్ రెడ్డిని వేరు చేసి ఉమ్మడి జిల్లా రాజకీయాలను చూడగలమా. ఒక వేళా డీసీసీబీ పదవిని ఆశించడం రమేష్ రెడ్డి వ్యక్తిగతమే అయితే మాజీ మంత్రిగా ఉమ్మడి జిల్లాలో కీలక నేతగా బీఆర్ఎస్ పార్టీ పరువును కాపాడుకునే బాధ్యత ప్రశాంత్ రెడ్డికి లేదా. ఉంటే గనుక తన సొంత మండలం, ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామమైన వేల్పూర్ సోసైటీ ఛైర్మన్ గా ఉన్న రమేష్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టలేక పోయాడో రాష్ట్రంలోని బీఆర్ఎస్ ముఖ్య నాయకులకు తెలుసా?
అంటే కేసీఆర్ కు ఆత్మలా ఉంటున్నట్లుగా నటిస్తూ కేసీఆర్ ను మోసం చేసే వారి బండారం బట్టబయలైనా ఎవ్వరూ పట్టించుకోరు. కేసీఆర్ కూడా ఈ తతంగాన్ని గుర్తించడు. పోనీ రమేష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు కదా. కనీసం ఈ చర్యకు కూడా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేక పోయాడు. రమేష్ రెడ్డికి వీరంతా కూడబలికి మద్ధతు ఇచ్చినట్టే కదా. ఇప్పుడు చెప్పండి కేసీఆర్ ను నమ్ముకుని ఉన్న పోచారం కుటుంబానికి జరిగిన అన్యాయంలో ఎవరి తప్పుంది. జరిగిన తప్పును తేటతెల్లం చేసినప్పటికీ అధిష్టానం ఇంకా ప్రశాంత్ రెడ్డి భ్రమలోనే కొనసాగుతుంటే చూస్తూ ఊరుకోవాల్సిందే.అందుకే కేసీఆర్ పై ప్రేమను శాశ్వతంగా గుండెలో పెట్టుకుని కేవలం తన రాజకీయ శత్రువులకు సమాధానం ఇచ్చేందుకు పోచారం ఈ అడుగు వేశారు. అంతే కానీ స్వార్థం కోసం కాదన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular