నిజాంసాగర్ ఆయా కట్టు ప్రాంతంలో రైతులు ముందస్తు వరి నాట్లు ఇప్పటికే వేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నిజాంసాగర్ నీటిని ఆదివారం ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తోట లక్ష్మీ కాంతారావు, జిల్లా పరిషత్ చైర్మన్ నీటి విడుదల చేశారు.
ద్రోణ కామారెడ్డి ప్రతినిధి
నిజాంసాగర్ మండలం లోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా వానాకాలం పంటల సాగుకు ఆదివారం నీటిని విడుదల చేసిన మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి , జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు.పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫేదార్ శోభా రాజు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.ఈసందర్భంగా పోచారం మీడియాతో మాట్లాడుతూ1932 లో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు.మొత్తం 2.70 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండేది. కానీ ప్రాజెక్టు లోకి సరిగ్గా నీళ్ళు రాకపోవడంతో ఆయకట్టు తగ్గిపోయింది.ప్రస్తుతం అలీసాగర్ వరకు ఉన్న 1.30 లక్షల ఎకరాలు నిజాంసాగర్ పరిధిలో ఉన్నది. మొత్తం పది మండలాల పరిధిలో సాగు చేస్తున్నారు.రాష్ట్రంలోనే మొదటగా ఈ ప్రాంతంలోని రైతులు రోహిణి కార్తె లోనే నార్లు పోసి త్వరగా నాట్లు వేస్తారు.గత ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా జూన్ నెలలోనే నీళ్ళు విడుదల చేయాలని రైతులు కోరారు.
రైతుల కోరికను రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళగా వారు సానుకూలంగా స్పందించారు.రైతుల కోరిక మేరకు సాగునీటి శాఖ అధికారులను సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి అనుమతితో వానాకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేసాం.నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.6 TMC లు.ప్రాజెక్టులో ప్రస్తుతం 4.3 TMC ల నీరు ఉన్నది. ఇందులో డెడ్ స్టోరేజ్ పోను 3.6 TMC ల నీరు కాలువలకు విడుదల చేయవచ్చు.ఒకవేళ సమయానికి వర్షాలు కురవక ప్రాజెక్టు లోకి నీళ్ళు రాకపోతే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి 2 TMC ల నీరు తీసుకోవడానికి అవకాశం ఉన్నది.నీటిని విడతల వారిగా విడుదల చేస్తాం. మొదటి విడతలో భాగంగా ఈరోజు నుండి 1400 క్యూసెక్కులను విడుదల చేస్తున్నాం. మొదటి విడతలో నాట్లు వేసుకుంటారు కాబట్టి 15 రోజులు కాలువకు నీటి విడుదల జరుగుతుంది. తర్వాత ఒక్కో విడతలో పది రోజులు నీటి విడుదల జరుగుతుంది.వర్షాకాలం కాబట్టి వానలతో కొంత మేలు జరుగుతుంది.సాగునీటి, రెవిన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేసి అన్ని డిస్ట్రిబ్యూటరీలకు నీళ్ళు సమంగా అందే విదంగా చర్యలు తీసుకోవాలి.రైతులు నీటిని వృదా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రాజెక్టు లలో నీళ్ళు లేని కారణంగా రాష్ట్రంలోని ఏ సాగునీటి ప్రాజెక్టు ఆయకట్టుకు కూడా ఈ ఏడాది వానాకాలం పంటల సాగుకు నీరు విడుదల చేయలేదు. కేవలం నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి మాత్రమే నీటి విడుదల జరిగింది.గత ఏడాది యాసంగిలో నీటి విడుదల క్రమబద్ధీకరణ చేసి పొదుపుగా వాడడంతో ప్రస్తుత వానాకాలం సాగుకు నీళ్ళు మిగిలాయి.నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదలకు అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, సాగునీటి శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి రైతుల తరుపున పోచారం ధన్యవాదాలు తెలిపారు.
