ద్రోణ కాగజ్ నగర్
అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జి పూర్తి చేయడంలో జాప్యానికి నిరసనగా రేపు ఉదయం 9 గం.ల నుండి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చోనున్న సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి వద్ద అసంపూర్తిగా ఉన్న పెద్ద వాగు బ్రిడ్జ్ స్థలాన్ని మరియు వర్షానికి కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డును పరిశీలించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్టర్ కు సకాలంలో బిల్లు చెల్లించకపోవడంలో జాప్యం చేసిన కారణంగా ఈ సమస్య ఉత్పన్నమైందని, యుద్ధ ప్రాతిపదికన అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తిచేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసి విడుదల చేశారు.*రేపు ఉదయం 9 గం.లోగా ఈ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోతే నిరవధిక నిరాహార దీక్షకు ఈ బ్రిడ్జి మీదనే కూర్చుంటానని తెలియజేశారు. గత నెల రోజులుగా ఇన్చార్జి మంత్రి సీతక్క కి ఈ బ్రిడ్జి గురించి అనేక మార్లు తెలియజేయడం జరిగిందని, ఆయినా ఈ సమస్యని పరిష్కరించడంలో వారు విఫలమయ్యారని దుయ్యబట్టారు.రేపు జరిగే నిరవధిక నిరాహార దీక్షకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
