Tuesday, February 17, 2026

రాజకీయ వారసుడిని ప్రకటించిన మాయావతి

ద్రోణ హైదరాబాద్: జూన్ 23

బీఎస్పీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ వారసుడిని మరోసారి ప్రక టించారు. పార్టీ బాధ్యత లను తన మేనల్లుడైన ఆకాశ్ ఆనంద్‌కు తిరిగి అప్పగించారు.
గతేడాది డిసెంబర్‌లోనే తన రాజకీయ వారసుడిగా ఆకాశ్‌ ఆనంద్‌ని ప్రకటించిన మాయావతి.. మే నెలలో సార్వత్రిక ఎన్నికల వేళ కేసు నమోదు కావడంతో ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. రాజకీయ పాలన దీక్ష వచ్చేవరకు ఆయన్ను తప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఆదివారం సమావేశమైన పార్టీ నేతలు ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఎదురైన ఘోర ఓటమిపై సమీక్షించారు.
ఈ నేపథ్యంలో ఆకాశ్‌ను పదవి లోంచి తొలగించిన నెల రోజుల వ్యవధిలోనే తిరిగి నియమించడం గమనార్హం. ఆదివారం బీఎస్పీ ముఖ్య నేతలు లఖ్‌నవూలో సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో పార్టీ ఆఫీస్‌బేరర్లు, నేతలు పాల్గొనగా.. ఆకాశ్ ఆనంద్‌ను తన రాజకీయ వారసుడిగా, బీఎస్పీ జాతీయ సమన్వయకర్తగా నియమిస్తూ మాయావతి నిర్ణయించారని ఆ పార్టీ సీనియర్‌ నేత సర్వర్‌ మాలిక్‌ మీడియాకు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular