Saturday, February 21, 2026

సీబీఐ చేతికి ఏపీ మద్యం స్కాం కేసు

ద్రోణ అమరావతి ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో మద్యం విధానంపై అనేక ఆరోపణలు ఉన్నాయి.
ఒక్క ఇంటర్నేషనల్ లేదా నేషనల్ బ్రాండ్ మద్యం ఐదేళ్లలో ఏపీలో దొరకలేదు.
అంతే కాదు బూమ్ బూమ్ లాంటి విచిత్రమైన బ్రాండ్లు పుట్టుకొచ్చాయి. దుకాణాల్లో ఎక్కడా ఆన్ లైన్ పేమెంట్ అనే వ్యవస్థ లేదు.
అంతేనా పేరుకు ప్రభుత్వం కానీ.. మద్యంతయారీ దగ్గర్నుంచి రీటైల్ దుకాణాల్లో ఉండే సిబ్బందగి వరకూ మొత్తం వైసీపీ చెందిన వారే ఉన్నారు. చివరికి రవాణా కూడా వారి కనుసన్నల్లోనే జరిగింది. దీంతో అసలు ఎంతకు అమ్ముతున్నారు. ఎంత మద్యం ఆదాయం అన్నది వారు రాసిందే లెక్క.
ఇలాంటి పరిస్థితుల్లో వేల కోట్ల లిక్కర్ స్కాం జరిగిందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి.టీడీపీ బీజేపీ, జనసేన ఈ ఆరోపణలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ పార్టీల కూటమి అధికారంలోకి రావడంతో లిక్కర్ కేసుపై దృష్టి పెట్టారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ఒక్క పాత బ్రాండ్ అమ్మకానికి లేదు.
అన్నీ వైసీపీ నేతల డిస్టిలరీల్లో తయారయ్యే ఊరూపేరూ లేని మద్యాన్ని అమ్మారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular