Tuesday, February 17, 2026

నత్త నడకన కొల్లూర్ బ్రిడ్జి నిర్మాణం

గత ఏడాది పడరాని పాట్లు పడ్డ ప్రజలు

వర్షాకాలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతూ రహదారులపై నీళ్లు వచ్చి చేరడంతో రోడ్లపై రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలక్కుండా ఉండేందుకు ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లు పనులు కొనసాగించడంలో నత్తతో పోటీ పడుతున్నారు. ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్న చందంగా గత ఏడాది కొల్లూరు సమీపంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని పోతంగల్ మండలం, కొల్లూరు గ్రామ సమీపంలో బోధన్ కు వెళ్లే రహదారి పై హై లెవెల్ వంతెన నిర్మించేందుకు ఆనాటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అట్టి పనులకు ఆనాటి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులను రహదారి భవనాల శాఖ ఓ గుత్తేదారుకు పనులను అప్పగించారు. పనులను ప్రారంభించినట్లు ప్రారంభించి ఉన్న పాత రోడ్డును తవేసి, రహదారి మల్లింపు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలక్కుండా చేయాల్సిన సంబంధిత శాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యాన్ని వహించారు. రహదారి మల్లింపులో పైపులు వేయకుండా మార్గాన్ని ఏర్పాటు చేశారు. గత వర్షాకాలంలో వర్షాలు కురిసిన సమయంలో మళ్లించిన రహదారిపై నీళ్లు చేరడం, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు వర్షానికి కొట్టుకుపోయింది. రెండు నెలలపాటు తొంగి చూసినా నాధుడే కరువయ్యారు ఆనాడు. కొల్లూరు నుండి బోధన్ కు వెళ్లాల్సిన ప్రజలు పడరాన్ని పాట్లు పడ్డారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మళ్లింపు రోడ్డు కొట్టుకుపోవడం అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక ప్రజలే రోడ్డు మళ్లింపు వద్ద పైపులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ పనుల వద్ద ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు ఎంతోమంది ప్రమాదాలకు ఆనాడు గురయ్యారు. మరోపక్క పనులను దక్కించుకున్న గుత్తేదార్ ఆర్మూర్ ప్రాంతానికి చెందిన వారు కావడంతో, ఈ ప్రాంత పాలకులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పనులు చేపట్టాలంటే మా అనుమతి తీసుకోవాలని, మా అనుమతి లేకుండా పనులను ఎలా దక్కించుకున్నారని హుకుం జారీ చేశారు. ఈ ప్రాంతంలోని పరిస్థితులను అర్థం చేసుకొని పనులను దక్కించుకున్న కొద్దిపాటి పనులను చేపట్టి బిస్తర్ లేపేశారు. సంబంధిత శాఖ అధికారులు ఏం చేయాలో అర్థం కాక తలలు భాదుకున్నారు. నిబంధనల మేరకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ పనులను చేపట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాలేదు. సంబంధిత అధికారులు అట్టి పనులను మరో గుత్తేదారుకు అప్పగించారు. పనులు దక్కించుకున్న గుతేదార్ కొంతమేరకు పనులను చేపట్టారు. తీరా వర్షాకాలం సమీపిస్తుండడంతో గత ఏడాదిపడ్డ అవస్థలు పడాల్సి వస్తుందేమోనని ఈ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. ఇంత జరుగుతున్న పాలకులు సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి హైలెవెల్ వంతెన పనులు పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular