Saturday, February 21, 2026

పార్టీ గెలుపుకు కృషి చేసిన వారు ధైర్యంగా ఉండాలి

ద్రోణ జుక్కల్ ప్రతినిధి

నిజాంసాగర్ మండలం హాసన్ పల్లి గ్రామంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హాజరయ్యారు.
ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత గ్రామానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం దాదాపు రూ. 20 లక్షల రూపాయలు మంజూరు చేశామని అన్నారు.
ప్రస్తుత అవసరాల కోసం మరో 5 లక్షలు మంజూరు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అని అన్నారు.కాంగ్రెస్ పార్టీలో చేరికల పట్ల కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని, పార్టీ గెలుపు కోసం పని చేసిన ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు ప్రతిఫలం ఉంటుందని భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular