బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సోమవారం మాజీ మంత్రి ప్రస్తుత బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డిని కలిశారు.బాన్సువాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి రాజకీయా పరిస్థితితుల గురించి వివరించడం జరిగింది.
దాదాపు 3 దశాబ్దాలుగా అధికారం అనుభవించినటువంటి పోచారం కుటుంబం అరాచక పాలన కొనసాగించారు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు స్వాతంత్రం వచ్చిందని భావించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏనుగు రవీందర్ రెడ్డి నాయకత్వం లో పని చేసి పార్టీ ని బలోపేతం చేసి లోక సభ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించారు. ఇపుడు మళ్ళీ పోచారం మన పార్టీ లోకి చేరడం తో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు ప్రారంభం అయినాయి. కాబట్టి వారి అరాచకాలను తట్టుకొని నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదొక్కుకోవాలి అంటే బాన్సువాడ నియోజకవర్గ్ కాంగ్రెస్ పార్టీకి ఏనుగు రవీందర్ రెడ్డి నాయకత్వం వహించడం తప్ప వేరే దారి లేదు కాబట్టి కార్యకర్తలం అందరం రవీందర్ రెడ్డి నాయకత్వం లొనే పని చేస్తాం అని వివరించారు.
బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి ని కలిసిన బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ
RELATED ARTICLES
