Friday, February 20, 2026

అందవెల్లి పెద్దవాగు ను సోమవారం పరిశీలించిన బిఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్దవాగు పై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి, కొత్తగా నిర్మించిన వంతెనకు అప్రోచ్ రోడ్డు వేయక జనాలు ఇబ్బంది పడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.కాగజ్ నగర్-దహెగాం ప్రధాన రహదారి కాగజ్నాగర్ గ్రామీణ మండలంలోని అందవెల్లి సమీప పెద్దవాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయింది. ఈ మార్గంలో కాగజ్నగర్, దహెగాం, భీమిని మండలాల్లోని 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.54 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.పాల్వాయి హరీష్ బాబు ప్రతిపక్ష నాయకుడా ప్రస్తుత ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత కూడా సమస్యలు ఉన్న వద్ద దీక్షలు చేయడం ఏంటి హైదరాబాదులోని ముఖ్యమంత్రి కార్యాలయంలో లేదా ఆర్ అండ్ బి అధికారుల తో మాట్లాడి నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి నిధులను తీసుకురావడం కోసం వాళ్ల దగ్గర దీక్షలు చేయండి. డిమాండ్లు చేసుకోండి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావలసిన నిధులు తీసుకురండి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాంటి రోడ్లపై వరి నాట్లు వేశారు ప్రజలకు అభివృద్ధి చేస్తామని మాటిచ్చారు గెలిచి నెలలు గడుస్తున్నా ప్రజల సమస్యలు మాత్రం తీరలేదువర్షాకాలంలో వ్యవసాయ పనుల కోసం రైతులు పంట పొలాల సామాగ్రి నాగళ్ళు , ఎడ్లబండ్లు , ఎరువులు విత్తనాలు రైతు కూలీలు రాకపోకలకు వేలు కాకుండా ఉండడం వల్ల రైతులు వ్యవసాయ భూమిని వదులుకున్నారు.స్కూల్ విద్యార్థుల చదువులకు , చిరు వ్యాపారులకు , వైద్యం కోసం వెళ్లే వారికి తీవ్ర సమస్యగా ఉంది.వర్షాకాలంలో అప్రోచ్ రోడ్డు తగ్గిపోతుందని తెలుసు అయినప్పటికీ ఇన్ని రోజులు దానిమీద సోయ లేకుండా ముందటి వర్షానికి తెగిపోగానే ఇప్పుడు వచ్చి నిరాహార దీక్ష చేస్తామని ప్రకటనలు చేయడం విడ్డూరంగాఉందన్నారు.నాసిరకం పనులతో నిర్మాణాలు చేపట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు ఇప్పుడు నిర్మిస్తున్న అప్రోచ్ రోడ్డు కూడా నామ్ కి వస్తే వేస్తున్నారు. ఒక వర్షానికి అది కూడా కూలిపోయేలా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు.తక్షణమే నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు రవాణకు సౌకర్యం కల్పించాలన్నారు మార్నింగ్ వాక్ లో తన వెంట టిఆర్ఎస్ నాయకులు కొండా రాంప్రసాద్, ఆవుల రాజకుమార్, బట్టుపల్లి మాజీ సర్పంచ్ ఉమా, యాదవ్, పర్వతి అంజన్న, పిరిచరందాస్, చిలుక శేఖర్, సొంటకి రంజిత్, ముంజం లింగయ్య, గుమసి నారాయణ, బాషిక కిరణ్ , షాకీర్ అందేల్లి, బట్టుపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular