Friday, February 20, 2026

ప్రభుత్వ ముఖ్య సలహాదారు ని కలిసిన బాన్సువాడ కాంగ్రెస్

గత రెండు రోజుల క్రితం పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 20 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎన్నో ఇబ్బందులకు గురై కాంగ్రెస్ పార్టీ జెండా మోసామని, పోచారం రాకతో మళ్లీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గడ్డు రోజులు ఎదురవుతాయని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మాజీ మంత్రి ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ ఆలీని బాన్సువాడ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు సోమవారం కలిశారు. పోచారం చేరికతో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎదురయ్యే పరిస్థితుల గురించి ప్రవక్త సలహాదారుకు కాంగ్రెస్ నాయకులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. పోచారం చేరికతో జరుగుతున్నటువంటి రాజకీయా పరిస్థితితుల గురించి వివరించారు.
దాదాపు 3 దశాబ్దాలుగా అధికారం అనుభవించినటువంటి పోచారం కుటుంబం అరాచక పాలన కొనసాగించారు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు స్వాతంత్రం వచ్చిందని భావించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏనుగు రవీందర్ రెడ్డి నాయకత్వం లో పని చేసి పార్టీ ని బలోపేతం చేసి లోక్ సభ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించారు. ఇపుడు మళ్ళీ పోచారం మన పార్టీ లోకి చేరడం తో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు ప్రారంభం అయినాయి. కాబట్టి వారి అరాచకాలను తట్టుకొని నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదొక్కుకోవాలి అంటే బాన్సువాడ నియోజకవర్గ్ కాంగ్రెస్ పార్టీకి ఏనుగు రవీందర్ రెడ్డి నాయకత్వం వహించడం తప్ప వేరే దారి లేదు. కాబట్టి కార్యకర్తలం అందరం రవీందర్ రెడ్డి గారి నాయకత్వం లొనే పని చేస్తాం అని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పార్టీ కి పెద్ద దిక్కుగా ఉన్న మీకు బాన్సువాడ నియోజకవర్గ పరిస్థితులు పూర్తిగా తెలిసిన నాయకులుగా ఈ రాష్ట్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడే బాధ్యత తీసుకొని బాన్సువాడ నియోజకవర్గం లో ఏనుగు రవీందర్ రెడ్డి నాయకత్వం కొనసాగేలా చూడాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular