Saturday, February 21, 2026

పోచారాన్ని కాంగ్రెస్ అగ్ర నేతలకు పరిచయం చేసిన రేవంత్

సుదీర్ఘ రాజకీయ జీవిత అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన అనుభవాన్ని రాజకీయ చేతురాన్ని కాంగ్రెస్ పార్టీకి మనం ఎంత బలం చేకూర్తోందన్న నమ్మకంతో రేవంత్ రాజకీయంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పోచారం నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుగా వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వాటిని మరింత బలోపేతం చేసి ఐదేళ్లపాటు సుస్థిర పాలన కొనసాగించే ప్రయత్నంలో ఏదో భాగంగా రేవంత్ రెడ్డి ఒక అడుగు వేసినట్లు తెలుస్తోంది. ఆయన అలాంటి ప్రధానమైన నాయకులు గులాబీ పార్టీని వదిలి రావడం శుభ సూచకంగా భావించడం కాకుండా మరింతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ముఖ్యమంత్రి తమ ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోచారాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలకు పరిచయం చేయడం వారి కుటుంబ సభ్యుల రాజకీయ భవితవ్యం పై ఒక హామీని కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ విషయాలన్నిటినీ పోచారం సమక్షంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నంలో రేవంత్ వడివడిగా అడుగులు వేస్తున్నారు. పోచారం కుటుంబ సభ్యులను అగ్ర నేతలకు పరిచయం చేసిన సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది.
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్శి ను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తో కలిసి 24 అక్బర్ రోడ్డు లోని ఏ ఐ సి సి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.
ఇటీవల పార్టీలో చేరిన పోచారం ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు పరిచయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .
ఈ సందర్భంగా ఖర్గే ని శాలువాతో సన్మానించిన పోచారం.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , నాయకులు పోచారం సురేందర్ రెడ్డి , యం రాజీవ్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular