ద్రోణ హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత గత ఆరు నెలలుగా జరుగుతున్న ప్రభుత్వ పనితీరు, పరిపాలన, అంకితభావంను సీనియర్ నాయకునిగా, శాసనసభ్యునిగా గమనించానుఅని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రగతి జరగాలన్నా, పేదల కష్టాలు తీరాలన్నా, రైతులు హాయిగా ఉండాలన్నా రేవంత్ రెడ్డి ని బలపరచాలనే ఉద్యేశంతో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. నాతో పాటుగా నా కుమారుడు మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మా బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాం.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ ని కూడా కలవడం జరిగింది.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. మంచి ఫలితాలు వస్తాయి.
రేవంత్ రెడ్డి సమర్ధవంతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డి ని మనఃస్పూర్తిగా అభినందిస్తున్నాను.
అందరం కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలి. నేను ఏడు సార్లు శాసనసభ్యునిగా విజయం సాదించాను.1977 లో నా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే మొదలైంది. తరువాత టిడిపి, టిఆర్ యస్ లలో పనిచేశాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చాను.
నా రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో తిరిగి ముగింపు అక్కడికే వచ్చింది. తన మనసులో మాటలను పోచారం ఢిల్లీలో వ్యక్తం చేశారు.
