ద్రోణ హైదరాబాద్
కేసు కొట్టివేయాలంటూ హైకోర్టుకు కేసీఆర్
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని వివరించారు. రైల్ రోకో కేసులో తనను 15వ నిందితుడుగా చేర్చారని తెలిపారు. తాను రైల్ రోకో లో పాల్గొనలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై మంగళవారం విచారణ జరుగనుంది.
