పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ద్రోణ తొర్రూరు
తొర్రూరు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్ పరిధిలో లయన్స్ క్లబ్ వారిచే ప్రతిష్టాత్మకంగా నిర్మించబడి నిర్వహించబడుతున్న హరిహర ముక్తి ధామంలో అదనపు వసతులు మరియు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి తో* కలిసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్మశాన వాటికలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొస్తే నిధులు కేటాయించి అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు.తొర్రూరు మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా పరిష్కారం చేస్తామన్నారు.ప్రభుత్వం నుండి నిధులు కేటాయించి సమస్యలు పరిష్కరిస్తానన్నారు.
