ద్రోణ కామారెడ్డి
నిజాంసాగర్ మండల కేంద్రంలోని (కేజీబీవీ) కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలంలో విద్యార్థినిలకు యూనిఫామ్ మరియు పుస్తకాలు పంపిణీ చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.
ఎమ్మెల్యే కి విద్యార్థినిలు, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు.
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు.విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం కోసం పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పుస్తకాలు యూనిఫామ్ మరియు భోజన సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు.విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని సూచించారు.
చదువుతో పాటు ఆట పాటల్లో కూడా రాణించాలని చెప్పారు.
మార్కులు సాధించడమే లక్ష్యంగా చదువులు కొనసాగించవద్దని, వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యత పెంపొందించుకోవాలని అన్నారు.విద్యార్థులు ఉపాధ్యాయులను అనుకరిస్తుంటారు కాబట్టి మంచి వ్యవహారిక శైలిని అలవర్చుకోవాలని, విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు..



