ద్రోణ వేములవాడ ప్రతినిధి

వేములవాడ ఆలయ అభివృద్ధికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ వెలి చాలా రాజేంద్ర రావు తన ఉదారతను చాటుకున్నారు.
రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందినట్టు ఆలయ కమిటీ రసీదు తో ఒక ప్రకటన విడుదల చేశారు.
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయానికి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు రూ.10 లక్షలు విరాళం అందించారు. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల సమయంలో ఆలయ అభివృద్ధికి తోడ్పడతానని ప్రకటించిన రాజేందర్ రావు అప్పుడు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎంత మొత్తం సహాయం చేస్తాననే విషయాన్ని వెల్లడించలేకపోయారు. ప్రస్తుతం ఎన్నికలు పూర్తయి తాను ఓటమికి గురైనప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధి కొరకు రూ. 10 లక్షలు అందజేశారు. తన భార్య వెలిచాల రేఖ పేరుతో ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆలయ కమిటీకి అందజేయగా బ్యాంకు నుండి రూ.10 లక్షలు స్వీకరించిన ఆలయ కమిటీ నిర్వాహకులు రాజేందర్ రావుకు నగదు ముట్టినట్టు రసీదును పంపించారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, కరీంనగర్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని, ముఖ్యంగా ప్రసాద్ స్కీం ద్వారా పార్లమెంట్ పరిధిలోని ఆలయాల అభివృద్ధి పై దృష్టి సారించాలని బండి సంజయ్ ని కోరారు. కరీంనగర్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా వేములవాడ రాజన్నను ప్రార్థించారు.
