మతోన్మాద భావజాలాన్ని తిప్పి కొట్టి ప్రజా సమస్యలపై పోరాడినప్పుడే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా సదస్సులో సిపిఎం నాయకుల రమేష్ బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మతోన్మాదం దాని పర్యవసానాలు అనే అంశం పైన జరిగిన సదస్సులో పార్టీ జిల్లా కార్యదర్శి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశంలో ప్రజా సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వాలు వైఫల్యం చెంది తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటం కొరకు ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అన్నారు. రెచ్చగొట్టే పద్ధతుల్లో ఒక మతానికి ఇంకో మతానికి దోషిగా చూపెడుతూ రాజకీయ ప్రయోజనాలను పొందటానికి తద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించటానికి ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ముస్లింలను చూపెట్టి మతవిద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతుల్లో ప్రసంగాలు చేసి ప్రజల్లో వైశ్యామ్యాలను పెంచి రామాలయం నిర్మాణం అనే పేరుతో మెజార్టీ హిందువుల ఓట్లను పొందాలని బిజెపి హిందూ మతోన్మాదాన్ని బూచిగా చూపెట్టి ముస్లిం మైనార్టీల ఓట్లను పొందాలని ఎంఐఎం ప్రయత్నం చేశారు. తప్ప ప్రజా సమస్యలను ఎక్కడ ప్రస్తావించలేదని వారు అన్నారు.ఎన్నికల్లో 400 స్థానాలను సాధిస్తామని చెప్పిన బిజెపి ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేకతను చూసి తన ప్రసంగాలు విద్వేషాలు పెరిగే పద్ధతుల్లో మాట్లాడారని ఫలితంగా తిరిగి మూడోసారి అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు.
ప్రజలు గతం కన్నా తక్కువ స్థానాలనే గెలిపించారని ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోకపోతే కుల, మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలు తమ సమస్యల పైన సంఘటితంగా పోరాడినప్పుడే సమస్యలు పరిష్కరించవచ్చని అన్నారు. పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని మనకు కావాల్సిన కూడు ,గూడు ,గుడ్డ తో పాటుగా ఉపాధి అవకాశాలను ప్రాంతీయ అసమానతలు లేకుండా అభివృద్ధి చెందేటట్టు ప్రయత్నం చేసినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనీ అన్నారు. ప్రజలు సన్నద్ధం కావాలని , మత విద్వేషాలకు ఎక్కడ తావివ్వకుండా ప్రజలందరూ సమైక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, పల్లపు వెంకటేష్, శంకర్ గౌడ్, నూర్జహాన్ జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్, సుజాత, నన్నే సాబ్, జంగం గంగాధర్, కొండ గంగాధర్, శిల్ప లింగం తో పాటుగా నాయకులు రాములు, నరసయ్య, ఎల్లయ్య, రవి, తదితరులతోపాటు వివిధ మండలాలల కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
మతోన్మాదాన్ని అంతం చేయాలి
RELATED ARTICLES
