Saturday, February 21, 2026

ఊట్ పల్లి ఊర చెరువును పరిశీలించిన అధికారులు

ద్రోణ బోధన్

ఊట్ పల్లి గ్రామంలో గల ఊర చెరువు అలుగు తూము మరమ్మత్తులకై గ్రామస్థులు వారం రోజుల క్రితం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని కలిసి విషయాన్ని తెలియజేయగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల జారీ చేయడంతో సంబంధిత శాఖ ఇంజనీర్, నేడు కాంట్రాక్టర్ శ్రీనివాస్ గ్రామ కాంగ్రెస్ నాయకులు,రైతులు,గ్రామ కార్యదర్శితో కలిసి అలుగు తూము ను పరిశీలించరు.ఇట్టి నిర్మాణ పనులను మూడు రోజుల్లో ప్రారంభిస్తానని కాంట్రాక్టర్ కాంగ్రెస్ నాయకులకు హామీ ఇచ్చారు.ఇందుకు సహకరించిన మా నాయకులు రైతుబాందవుడు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మరియు ఇందుకు సహకరించిన పీసీసీ డెలిగేట్ గంగా శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షులు నాగేశ్వర్ రావు,ఏరాజ్ పల్లి మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ నాయకులు నరేందర్ రెడ్డి కు కాంగ్రెస్ నాయకులు,రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular