Saturday, February 21, 2026

ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే

ద్రోణ కామారెడ్డి

కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన జ్యమగోని ప్యాట్ల నవ్య మృతి చెందగా ఆమె భర్త స్వామి గౌడ్ కు, బీబీపేట్ మండలం యాడరం గ్రామానికి చెందిన అరేటి వడ్ల సంగమేశ్వర మృతి చెందగా అతని భార్య ఆరేటి స్వప్న లకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 04 లక్షల రూపాయల బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా నుండి మంజూరైన చెక్కులను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంప గోవర్థన్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఎల్లప్పుడూ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ప్రమాదవశాత్తు పార్టీ కార్యకర్తలు మృతి చెందగా వారి కుటుంబాలను రోడ్డున పడకుండా పార్టీ భీమా నుండి 2 లక్షల ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది తెలిపారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలనే మంచి ఉద్దేశ్యంతో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షడు కెసిఅర్ ప్రమాద భీమా చేయించారని అన్నారు. పార్టీ కార్యకర్తలు అధర్య పడవద్దని పార్టీ ఎల్లప్పుడూ వారి కుటుంబాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, ఎంపీపీ బాలమణి పార్టీ నాయకులు బిక్క్ జీ బల్వంత్ రావు , రమేష్, భూరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి బల్వంత్ రావు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular