Tuesday, February 24, 2026

రాజస్థాన్ డాక్టర్లచే ఆక్యుప్రెషర్ క్యాంప్ బోధన్ లైన్స్ లో

ద్రోణ బోధన్ జూన్ 28

శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి బోధన్ లైన్స్ కంటి ఆసుపత్రి రకాసిపెట్ లో రాజస్థాన్ డాక్టర్ ల చే ఏడు రోజుల క్యాంప్ ని లైన్స్ కంటి ఆసుపత్రి లో నిర్వహించనున్నారు. ఆడిటోరియంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని ముఖ్య అతిథి లయన్ జిల్లా గవర్నర్ లయన్ వేమూరి లక్ష్మి ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఆక్యు ప్రెషర్ చికిత్స నేచర్ క్యూర్ పద్ధతికి చెందినదని మన శరీరంలోని ఏ భాగమైన అనారోగ్యానికి గురైనప్పుడు మన చేతిలోను అరికాలలోను ఉన్న అతి ప్రెషర్ పాయింట్ లో నొప్పిగా ఉంటుందని అందువలన ఈ పాయింట్ ని నొక్కటం ద్వారా ఆ యొక్క నొప్పి నుండి ఉపశమనం మరియు రక్తప్రసరణ సక్రమంగా జరుగుట వలన దాని ద్వారా బయో ఎనర్జీ కూడా ప్రసరించి వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందన్నారు. ఈ క్యాంపు అక్యుప్రెషర్ రీసర్చ్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్ జోద్పూర్ వారిచే నడపబడుచున్నదనని ఆక్యుప్రెషర్ మ్యాగ్నెటిక్ మరియు థెరపీ వైద్యులు జితేందర్ మరియు డాక్టర్ ప్రమోద్ తెలియజేశారు.
ఈ యొక్క శిబిరంలో చికిత్స పొందవలసినవారు నామమాత్రపు 200 రూపాయలు తో ఏడు రోజుల వరకు చికిత్సలను చేసుకోవచ్చని తెలిపారు.
ఈ యొక్క శిబిరంలో మహిళా డాక్టర్లు పురుష డాక్టర్లు వేరువేరుగా చికిత్సలు చేస్తామన్నారు.
కార్యక్రమంలో లైన్స్ కంటి ఆసుపత్రి ఫౌండర్ లైన్ పోలవరపు బసవేశ్వర రావు, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ లైన్ వై శ్రీనివాస్, జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ లైన్ కొడాలి కిషోర్, రీజియన్ చైర్మన్ లైన్ కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్, మాజీ రీజన్ చైర్మన్లు అయ్యార్ చక్రవర్తి, శ్రీనివాసరాజు, మరియు సభ్యులు సాయిబాబా గౌడ్, కేవీ సత్యనారాయణ తదితరులు ఈ శిబిరంలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular