Saturday, February 21, 2026

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రులు

ద్రోణ భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో… పలు అభివృద్ధి శంఖుస్థాపన కార్యక్రమంలో నాయకులు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి” పాల్గొన్నారు.భద్రాది కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా.. కొత్తగూడెం పట్టణంలో రూ. 124 కోట్లతో త్రాగునీటి పథకం పనులు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరియు సహచర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తో కలిసి ప్రారంభించడం సంతోషంగా ఉంది.*
కొత్తగూడెం పట్టణంలో డ్రైనేజీ సమస్యను సరిచేసేందుకు…రూ. 4 కోట్ల డిఎంఎఫ్టీ నిధులతో డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి… రాష్ట్రానికి *సేతుబంధు పథకం క్రింద రూ. 148 కోట్ల విలువ చేసే 12 ఆర్వోబీలు కావాలని కోరడం జరిగింది. అందులో ఒకటి మన కొత్తగూడెం జిల్లాలో ఉండటం ఆనందం కలిగిస్తుంది.కొత్తగూడెం ప్రసూతి దవాఖానాలో గత ప్రభుత్వం ఏసీలు పెట్టించకపోవడంతో ఎందరో తల్లులు, చిన్నారులు ఎండలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిస్తే.. వెంటనే *ప్రతీక్ ఫౌండేషన్ నుంచి 20 ఏసీలను పంపించి ఫిట్ చేయించా.*
శ్రీసీతారామచంద్రస్వామి పాదాల చెంత ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభిస్తాం.*
విమర్శలు చేసే వ్యక్తులను పట్టించుకోం మాకు ప్రజాసంక్షేమమే ముఖ్యం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular