Tuesday, February 24, 2026

షాద్ నగర్ పరిశ్రమలో భారీ పేలుడు… ఆరుగురు దుర్మరణం

ద్రోణ హైదరాబాద్

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్లో పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక సౌత్ గ్లాసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ పేలుడుతో పరిశ్రమ వద్ద భీతావహ వాతావరణం నెలకొంది. గాజు పరిశ్రమ కావడంతో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ ఘటనలో 15మందికి మందికి గాయాలు కాగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఒకేసారి కంప్రెషర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే దానిపై ఇంకా ఆరా తీస్తున్నా రు. మృతులు ఒడిశా, బిహార్, యూపీ వాసులుగా గుర్తిం చారు. తీవ్ర గాయాలైనవారిని మెరుగైన చికిత్స కోసం ఉస్మా నియా, గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular