గ్రామాలలో ప్రతి సమాచారం సిబ్బందికి తెలిసుండాలి
గార్ల పోలీస్ స్టేషన్ ను సందర్శించి తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్
ద్రోణ హైదరాబాద్
పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్లైన్ లో ఎంట్రి చేసి ఫిర్యాదు దారులకు రిసిప్ట్ ఇవ్వాలని మరియు వచ్చిన ఫిర్యాదుల పై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఐపీఎస్ సుధీర్ రాంనాధ్ కేకన్, పోలీస్ అధికారులను, సిబ్బందినీ ఆదేశించారు.
జిల్లా ఎస్పీ గార్ల పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ రికార్డ్స్ ను, స్టేషన్ పరిసరాలను మరియు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేసి పరిశీలించారు. అందులో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు . రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను తదితర ప్రదేశాలను పరిశీలించారు.
అలాగే కోర్టు విధులు నిర్వహించే అధికారుల రూమ్ లో రికార్డ్స్ భద్రపరచుట, 5S అమలు తీరును పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను, గదులను, రికార్డులను ఎవరి పరిధిలో వారు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. స్టేషన్ లో రోజు వారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ,సెంట్రీ రిలీఫ్ బుక్, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్, బీట్ డ్యూటీ బుక్స్, సస్పెక్ట్ చెక్ రిజిస్టర్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్, ఫైనల్ రిపోర్ట్స్ తదితర రికార్డ్స్ ను తనిఖి చేశారు, రికార్డులను ప్రతిరోజు పెండింగ్ లేకుండా అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు.పోలీస్ స్టేషన్లో నమోదయిన గ్రేవ్, నాన్ గ్రేవ్ సిడి ఫైల్స్ ను పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని ఎస్సై కు సూచించారు. ఎస్పీ సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నందు 5S ను ఎవరి పరిధిలో వారు నిత్యం అమలు అయ్యేటట్లు చూసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయో తెలుసుకొని ,ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. రోజు పాయింట్ బుక్స్ లను విజిట్ చేయలని, డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహించాలని , రౌడీ షీటర్స్, సస్పెక్ట్స్ మరియు పాత నేరస్థుల ఫై నిఘా పెట్టాలని బ్లూ కోల్ట్స్ సిబ్బందికి అధికారులకు సూచించారు. రిసెప్షన్ సిబ్బంది విధులను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి పిర్యాదు ను ఆన్లైన్ లో ఎంట్రీ చేసి పిర్యాదు దారులకు రీసిప్ట్ ఇవ్వాలని సూచించారు. గ్రామాలలో గొడవలు , అక్రమ రవాణా కు సంబంధించిన ప్రతి సమాచారం ముందస్తుగా తెలుసుకొని ఉండాలని, సి సి టి ఎన్ ఎస్ అప్లికేషన్ పై ఎప్పటికప్పుడు డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయలని సూచించారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని, సిబ్బంది అందరూ బాధ్యత యుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ తిరుపతి రావు,గార్ల బయ్యారం సీఐ రవి కుమార్, గార్ల ఎస్.ఐ జీనాథ్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
