జర్నలిస్టుల హక్కుల సాధనలో భాగంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కి వినతి పత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) నాయకులు
ద్రోణ న్యూఢిల్లీ
జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతూ జర్నలిస్టుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక జర్నలిస్టు అసోసియేషన్.. అతి తక్కువ కాలంలో భారత దేశంలోనే ఎక్కువ సభ్యులను కలిగిన అసోసియేషన్ గా నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ గుర్తింపు పొందింది. జర్నలిస్టుల సంక్షేమానికి ఎన్నో రకాల పోరాటాలు చేసినా కూడా జర్నలిస్టుల బ్రతుకుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్ధకంగా మారిపోయింది.. జర్నలిస్టుల సంక్షేమానికి “జర్నలిస్టుల కార్పొరేషన్” ను ఏర్పాటు చేస్తేనే ఫలితం ఉంటుందన్న ఉద్దేశంతో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నాయకులను కలిసి జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు నిరంతరం పోరాటానికి సిద్ధమయింది.ఈ నేపథ్యంలోనే జర్నలిస్ట్ సోదరులకు జరుగుతున్న అన్యాయాన్ని వారి కష్టాలను దృష్టిలో పెట్టుకొని 28 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నేషనల్ ప్రెసిడెంట్ సురేంద్ర బాబు ఆధ్వర్యంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఏ.ఆర్.ఏ) విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ని కలసి జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటుకు మద్దతు కోసం వినతి పత్రాన్ని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నాయకులు అందజేశారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై మీరు చేసే అవిశ్రాంత పోరాటానికి తెలుగుదేశం పార్టీ తరుపున నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఎన్.ఎ.ఆర్.ఎ నాయకులకు తెలియచేసారు. పత్రికా స్వేచ్చ ప్రతీ సమాజానికి, వ్యక్తి జీవనానికి అత్యంత కీలకమైనది. ఆ దేశంలో కానీ, సమాజంలో కానీ పత్రికా స్వేచ్ఛను నియంత్రించడమంటే ఆ సమాజాన్ని అంధకారంలోకి నెట్టివేయడమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల కు సంక్షేమం రక్షణ కల్పించి జర్నలిస్టులకు పూర్తి న్యాయం చేస్తుందన్నారు… ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎంపీ కేశినేని చిన్ని తెలియజేశారు.జర్నలిస్ట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించి, కార్పొరేషన్ సాధించడానికి తను పూర్తి మద్దతు ఇస్తానని తెలియచేసిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కు ఎన్.ఎ.ఆర్.ఎ నాయకులు కృతజ్ఞతలు తెలియచేసారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ని కలసిన వారిలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్ర బాబు, నేషనల్ జనరల్ సెక్రటరీ మరియు మద్దినేని మానస, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
