ద్రోణ ఆదిలాబాద్
ఆదిలాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యుడు , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాథోడ్ రమేష్ శనివారం కన్నుమూశారు. శనివారం ఉదయం ఉట్నూరులోని తన నివాస గృహంలో రక్తపోటు, రక్తపు నిల్వలు పడిపోయి స్పృహ తప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్య చికిత్సల నిమిత్తం ఆదిలాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు గజానందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. మధ్యాహ్నం 12:30 గంటల కు మార్గమధ్యంలోనే కోమాకు వెళ్లి చివరి శ్వాస విడిచారు. రమేష్ రాథోడ్ కొంతకాలంగా అధిక రక్తపోటు,కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఢిల్లీలో ఇటీవలే చికిత్స పొంది వచ్చారు.
తిరుగులేని నేతగా ఎదిగిన రాథోడ్
ఆదిలాబాద్ జిల్లా రాజకీయాలను శాసించిన రాథోడ్ రమేష్ జడ్పిటిసిగా,ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా, పార్లమెంటు సభ్యునిగా సేవలందించారు. రాథోడ్ రమేష్ కు భార్య సుమన్ రాథోడ్ ఒక పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఆయనకు ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆయన మృతి పట్ల పలువురు ప్రగాఢ సంతాపం తెలిపారు.
