Tuesday, February 24, 2026

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన చైర్మన్

ద్రోణ కామారెడ్డి ప్రతినిధి

మున్సిపల్ చైర్ పర్సన్ చేతుల మీదుగా బుక్స్ పంపిణీ చేసిన వార్డ్ కౌన్సిలర్ తేజపు మానస ప్రసాద్, కామారెడ్డి పట్టణంలోని 23వార్డ్ రాజీవ్ నగర్ కాలనీ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు అయిన తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం మరియు అంగన్వాడీ సెంటర్ లోని సుమారు 200 ల మంది పేద పిల్లలకు వార్డ్ కౌన్సిలర్ తేజపు మానస ప్రసాద్ తన సొంత డబ్బులతో ఉచితంగా పలకలు,నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ నోట్ బుక్స్ ని కామారెడ్డి మునిసిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా పిల్లలకు అందించారు.ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అయిన నహిద్ ఫాతిమా , సుజాత మరియు పిల్లల తల్లితండ్రులు నాయకులు క్రిష్ణ, ఇల్యాస్, అర్షద్, హైమద్ కాలోని వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular