Tuesday, February 24, 2026

నీట మునిగిన మంత్రుల, ఎంపీ నివాసాలు

ద్రోణ న్యూఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధార‌ణ పౌరుల‌తో పాటు రాజ‌కీయ నేత‌లు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వ‌ర్షాల‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల నేప‌ప‌థ్యంలో ఢిల్లీలో ఉన్న ప‌లువురు ఎంపీల నివాసాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయి. ఇంటి చుట్టుప‌క్క‌ల నీరు నిలిచిపోయింది. త‌న ఇల్లు వ‌ర్ష‌పు నీటితో నిండిపోయిన‌ట్లు కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ పేర్కొన్నారు. ఢిల్లీ జల మంత్రి అతిషి నివాసం కూడా నీట మునిగింది.ఢిల్లీలో కుండపోత వర్షం.రాత్రి నుంచి ఎడతెరిపిలేని వానతో జలమయమైన లోతట్టు ప్రాంతాలు.పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం.మరో 2 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం.ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్లో భారీ వర్షాలు.పలు ప్రాంతాల్లో నీట మునిగిన కార్లు, బైకులు.ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలిన రూఫ్. ఆరుగురికి గాయాలు.ఎయిర్ పోర్ట్ రూఫ్ కూలడంతో కార్లు ధ్వంసం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular