Tuesday, February 24, 2026

విధి నిర్వహణ ఎంతో గొప్పది

ద్రోణ బోధన్, జూన్ 29

బోధన్ డిపోలో విధులు నిర్వహించి శనివారం పదవి విరమణ చెందిన ఎస్డీఐ ఎండీఎస్ రహమాన్, ఎడిసి యండీ అలీముద్దీన్ లను బోధన్ డిపో మేనేజర్ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, పదవి విరమణ ప్రతి ఒక్కరికి సహజమైనప్పటికీ అధికారులు తమ పదవి కాలంలో ప్రజలకు చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆర్టీసీ అనేది ప్రజలతో మమేకమైన సంస్థ అని అందువల్ల ఈ సంస్థలో పనిచేసే ప్రతీ ఒక్కరు ప్రజల మమకారం చూరగొనాలని ఆయన కోరారు. కాగా పదవీ విరమణ చెందిన అధికారులు తమ శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా గడపాలని డిఎం శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బోధన్ డిపో ఎంఎఫ్ హరిప్రసాద్ గౌడ్, ఎస్టీఐ లక్ష్మణ్, సృజన, టైర్ ఎడీసీ బిఎ రాణి తో పాటు ఎడీసీలు, ఆర్టీసీ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular