Tuesday, February 24, 2026

ఉపాధ్యాయుల బదిలీలు

ద్రోణ హైదరాబాద్:జూన్ 30
తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యా బోధ‌న‌లో నాణ్యతా ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయ బ‌దిలీల ప్రక్రియకు తెలంగాణ సర్కార్ రూప‌క‌ల్పన‌ చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యా యుల బదిలీలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. 0 – 19 వ‌ర‌కు విద్యార్థులు న్న పాఠ‌శాల‌కు ఒక‌రు, 20 నుంచి 60 మంది విద్యార్థు లున్న పాఠ‌శాల‌కు ఇద్దరు, 61 నుంచి 90 వ‌ర‌కు విద్యార్థులున్న పాఠ‌శాల‌కు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండేలా గ‌త ప్రభుత్వం 2015, జూన్‌, 27న జీవో నెంబర్ 17, 2021, ఆగ‌స్టు 21న జీవో నెంబర్ 25 జారీ చేసింది. అయితే విద్యార్థుల సంఖ్య, వారికి మెరుగైన విద్యా బోధ‌నను దృష్ట్యా తాజాగా ఆయా పాఠ‌శాల‌ల‌కు పోస్టు ల‌కు కేటాయింపు చేయను న్నారు. 1-10 మంది విద్యార్థులున్న పాఠశాల‌కు ఒకరు ,11 నుంచి 40 వ‌ర‌కు విద్యార్థు లున్న పాఠ‌శాల‌కు ఇద్దరు , 41 నుంచి 60 మంది విద్యార్థులున్న పాఠ‌శాల‌కు ముగ్గురు, 61కి మందికి పైగా విద్యార్థులున్న పాఠశాల‌కు ఆ పాఠ‌శాల‌కు మంజూరైన అన్ని పోస్టులు భ‌ర్తీ చేసేలా వెబ్ ఆప్షన్ల కేటాయింపు ఇవ్వనట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular