ద్రోణ బోధన్
సిద్ధాపూర్ లో వాటర్ ప్లాంట్ ను ప్రముఖ శాస్తవేత్త పైడి ఎల్లారెడ్డి ప్రారంభించడం జరిగింది.ఈ ప్రారంభ కార్య క్రమంలో పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన నీటిని త్రాగడం వలన మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో అవగాహన కల్పించారు.
కొంత మంది చేస్తున్న చెడు ప్రచారం ఫిల్టర్ వాటర్ తాగడం వలన మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది అని ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో అది అంత అబద్ధం అని కొట్టి పారేయడం జరిగింది.
హైదరాబాద్ లాంటి పట్టణంలో 99% మంది శుద్ధి చేసిన నీళ్లు మాత్రమే తాగుతున్నారని వివరించారు. ఇలా అనేక విషయాలపై అవగాహన కల్పించారు.దీనికి సిద్దపూరు,చుట్టూ పక్క గ్రామ ప్రజలు పైడి ఎల్లారెడ్డి ని ధన్యవాదాలు తెలుపుతూ సన్మానించారు.సిద్దపుర్ యువత మాట్లాడుతూ శుద్ధి చేసిన నీళ్లను మాత్రమే వాడి మా ఆరోగ్యం కాపాడుకుంటామని మీకు ఎల్లపుడూ కృతజ్ఞత బావoతో ఉంటామని పైడి ఎల్లారెడ్డి కి భరోసా ఇవ్వడం జరిగింది.
