ద్రోణ కోరుట్ల
అంగన్వాడీ కేంద్రం ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు అందించే కోడిగుడ్డులో కోడిపిల్ల ప్రత్యక్షమైంది. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది. పట్టణంలోని ఆకుల మన్విత అనే చిన్నారికి స్థానిక అంగన్వాడీ టీచర్ కోడిగుడ్లను అందజేశారు. ఇవాళ ఉదయం గుడ్డును ఉడకబెట్టే క్రమంలో ఒకటి బరువు తక్కువగా ఉండి తేడాగా కనిపించింది. దీంతో గుడ్డు పై పెంకు తొలిచి చూడగా లోపల కోడిపిల్ల కదులుతూ కనిపించింది. దీంతో
మన్విత తల్లి షాక్ కి గురయ్యారు. కాగా అంగన్వాడీ సెంటర్ల ద్వారా నాణ్యతలేని కోడిగుడ్లు అందిస్తున్నారని ఆరోపణలు వస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం హాట్ టాపిక్గా మారింది.
