Tuesday, February 24, 2026

కేంద్ర మంత్రి , ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య

ఈ నెల 24న ఢీల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కాలమరమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేసిన ఎంపీ డా.కడియం కావ్య

ద్రోణ వరంగల్

స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ

స్మార్ట్ సిటీ మిషన్ ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్రం ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి, తెలంగాణ పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 24న ఢీల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కింద చేపట్టిన పనులు కొన్ని పూర్తి చేయగా, చాలా వరకు పెండింగ్ లో ఉన్నందున కాలపరిమితిని మరో ఏడాది వరకు పొడిగించాలని ఎంపీ డా.కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం అన్నారు. ఇక వరంగల్ ప్రజలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు అందనున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్‌ నగరాన్ని స్మార్ట్‌సిటీ పథకంలో భాగంగా మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరి తరుపున ఎంపీ డా. కడియం కావ్య కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular