ద్రోణ న్యూఢిల్లీ
వాట్సాప్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ రౌండ్ షేప్‌లో రెయిన్ బో కలర్లో ఉన్న ఒక ఐకాన్ కనిపిస్తోంది. ఆ సింబల్‌పై క్లిక్ చేయగానే మెటా ఏఐ పేరుతో చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఏ సమాచారం అడిగినా క్షణాల్లో వచ్చేస్తుంది.
ఈ ఫీచర్ సహాయంతో ఇకపై యూజర్లు ఏదైనా సమాచారం కావాలనుకుంటే ప్రత్యేకంగా యాప్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. వాట్సాప్‌లోనే ఆ పని కూడా చేసేయొచ్చు. ఉదాహరణకు గూగుల్ సెర్చ్‌లో వెతికే ప్రతీ అంశం ఇకపై వాట్సాప్‌లోనే చెక్ చేసుకోవచ్చు. రెస్టారెంట్స్ మొదలు సినిమా షోల వరకు అన్ని వివరాలు ఈ ఏఐ ఫీచర్ ద్వారానే తెలుసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కొన్ని సేవలకే పరిమితమైన ఈ ఏఐ టూల్‌ను మరింత విస్తరించనున్నారు.
తెలుగులో అడిగితే కొన్ని సమాధానాలు తప్పుగా వస్తున్నాయని కొంతమంది అంటున్నారు.
