Tuesday, February 24, 2026

ఎపిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి సర్వం సిద్దం

కూటమి ప్రభుత్వం మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం.

మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు

ద్రోణ అమరావతి ప్రతినిధి

జులై 1న రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్ల పంపిణీ స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో లబ్దిదారులకు పింఛను ఇవ్వనున్న సిఎం మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెంచిన పింఛను అందజేత
పింఛను పెంచడంతో పాటు గడిచిన మూడు నెలలకు కూడా పింఛను పెంపును వర్తింపచేసిన సిఎం
పెరిగిన పింఛను రూ.4000, గత మూడు నెలల సొమ్ము రూ.3000 కలిపి రూ.7000 ఇవ్వనున్న ప్రభుత్వం
వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి ఇకపై రూ.4000 పింఛను దివ్యాంగులకు రూ.3000 నుంచి ఒకేసారి రూ.6000 చేసిన కూటమి ప్రభుత్వం
తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పింఛను రూ.5000 నుంచి రూ.15000 చేస్తూ నిర్ణయం.ఈ విభాగంలో పింఛను పొందే వారి సంఖ్య 24318 మంది.పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు ఖర్చు పింఛన్ల కోసం రూ.4,408 కోట్లు ఒక్క రోజులో పంపిణీ చేస్తున్న ప్రభుత్వం గడిచిన మూడు నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1650 కోట్లు అదనపు ఖర్చు.గత ప్రభుత్వంలో పింఛను కోసం కేవలం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు.దాదాపు 1,20,097 మందితో పింఛను పంపిణీ కార్యక్రమానికి సమాయత్తం ఏడాదికి ఇకపై పింఛన్ల కోసం రూ.34 వేల కోట్లు ఖర్చు చేయనున్న చంద్రబాబు ప్రభుత్వం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular