Tuesday, February 24, 2026

గ్రంధాలయాల్లో మహానేత జీవిత చరిత్ర పుస్తకాలు

ద్రోణ అమరావతి ప్రతినిధి

మహానేత, భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జీవిత చరిత్రపై వెలువడిన రెండు పుస్తకాలను ఆయా గ్రంథాలయాల్లో అందుబాటులో కి తెచ్చేందుకు చర్యలు చేపట్టనున్నట్టు విజయనగరం ఎంపీ అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం అప్పలనాయుడ హైదరాబాదులో ముప్పవరపు వెంకయ్య నాయుడు ని కలుసుకొని, ఆయన జీవిత చరిత్రను గూర్చి వెలువడిన రెండు గ్రంథాలను పరిశీలించారు. ఇదే రోజున ఈ రెండు గ్రంథాలను భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించడం..ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ విషయమని అప్పలనాయుడు పేర్కొన్నారు. “వెంకయ్య నాయుడు ఏ లైఫ్ ఈజ్ సర్వీస్ మహానేత భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు జీవిత చిత్రకథ ” అనే రెండు గ్రంథాల ప్రాథమిక సారాంశాన్ని అప్పలనాయుడు పరిశీలించారు. ఇంతటి మహానేత చరిత్రను తెలిపే ఈ రెండు గ్రంథాలను ఆయా గ్రంధాలయాల్లో అందుబాటులోకి తేవడానికి నిర్ణయించినట్టు అప్పలనాయుడు చెప్పారు. భావితరాల వారు వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తి చరిత్రను గూర్చి తెలుసుకోవడానికి వీలుగా ఆయా గ్రంధాలయాల్లో వెంకయ్య నాయుడు గూర్చిన చరిత్రను తెలిపే రెండు గ్రంథాలను అందుబాటులోకి తెచ్చి, ఆ గ్రంథాలను పొందుపరిచేందుకు కృషి చేస్తున్నట్టు అప్పలనాయుడు వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular