Tuesday, February 24, 2026

చంద్రబాబు పెన్షన్ అందించింది ఈయనకే

ద్రోణ అమరావతి ప్రతినిధి

గుంటూరు జిల్లా తాడేపల్లి (మ) పెనుమాకలోని గిరిజన కాలనీలో పాముల నాయక్ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి పెన్షన్ అందించారు. పాముల నాయక్ వృద్ధాప్య పెన్షన్, భార్యకు సి ఆర్ డి ఏ పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ డబ్బులు అందజేశారు. వాళ్ల ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు కావాలని బాబును నాయక్ కుటుంబం కోరగా.. కేటాయిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular