Tuesday, February 24, 2026

పేద ప్రజల జీవితలో వెలుగులు నింపిన బాబు

పింఛన్ పంపిణీలో:మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్

ద్రోణ అమరావతి ప్రతినిధి

అరకు నియోజకవర్గం అరకు వేలి మండలం పద్మపురం పంచాయితీ ఎండపల్లి వలస గ్రామంలో ఎన్టిఆర్ ఫించన్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యతిధిగా మాజీ మంత్రి, అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ స్థానిక ఎంపీటీసీ కిల్లో సాయిరాం

కూటమి నాయకులు పాల్గొని అర్హులైన ఫించన్ లబ్దిదారులకు ఫించన్ పంపిణీ చేసిన అనంతరం మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు ఎన్నికలో ఇచ్చిన మాట తప్పకుండ ఎన్ డి ఏ కూటమి ఉమ్మడి మేనిప్యోస్టోలో పొందుపరిచిన ఫించన్ పెంపుదలను నేడు ప్రతి ఒక్క పింఛన్ లబ్దిదారులకు అందించారు పింఛన్ దారుల కళ్ళలో ఆనందం చూడాలన్నదే చంద్రబాబు నాయుడు కళ అని ఎన్నికలో ఇచ్చిన మాట ప్రకారం వైసీపీ ప్రభుత్వంలో 3000 రూపాయలుగా ఉన్నా ఫించన్ ను ఒక్కసారిగా 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలుగా పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని స్వయానా ముఖ్యమంత్రి హోదాల లో నేరుగా పింఛన్ లబ్దిదారుల ఇంటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడం చాలా గొప్ప విషయమని అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలో కలిపి 7000 రూ, కూడా ఇస్తున్నాం

అని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అరకు పార్లమెంట్ అధ్యక్షులు కిడారి శ్రావణ్ కుమార్ తో పాటు అరకు నియోజక వర్గ ఇంచార్జీ దోన్ను దొర పద్మాపురం ఎంపీటీసీ కిల్లో ముక్త మాజీ జడ్పీటీసీ రమేష్ మాజీ వైస్ ఎంపీపీ పొద్దు అమ్మన్న క్లస్టర్ ఇంచార్జీ లు సాయిరాం రమేష్ యూనిట్ ఇంచార్జీ లు ద్రౌపతి నూకరత్నం కళావతి రాజు బూత్ ఇంచార్జీ లు కామేష్ దీన మాజీ సర్పంచ్ మహదేవ్ మాజీ ఎంపీటీసీ కుమార్ వార్డు సభ్యులు రాము ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular