Tuesday, February 24, 2026

బోధన్ రెవెన్యూ అధికారుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం

బోధన్ తాహసిల్ కార్యాలయంలో పనిచేసే అధికారులు సమయపాలన పాటించకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పనులపై వచ్చే ప్రజలకు అధికారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ప్రజలను నిర్లక్ష్యం చేస్తూ పొంతనలేని సమాధానాలు ఇస్తూ దాటవేస్తున్నారు. సోమవారం 11 గంటలు దాటిన కనీసం కార్యాలయానికి బాస్ గా బాధ్యతలు నిర్వహించే తాసిల్దార్ సైతం విధులకు హాజరు కాకపోవడం పై పలువురు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెవిన్యూ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. గ్రామీణ ప్రాంతాల భూముల అమ్మకాలు, కొనుగోలు చేసిన వారు తహసిల్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం సెలవు దినం కావడం సోమవారం కూడా అధికారులు నిద్రమత్తులోనే మునిగి తేలుతున్నారు. రిజిస్ట్రేషన్లు చేసుకునే రైతుల వద్ద నుండి కంప్యూటర్ ఆపరేటర్లు డబ్బు లేనిదే పని జరగడం లేదని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బోధన్ రెవిన్యూ అధికారులు అక్రమ సంపాదనకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అపవాదులు కూడా వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయానికి వచ్చే వారి పట్ల మర్యాద, సమస్యల పరిష్కార దిశలో అధికారులు నడుచుకోవడం లేదన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇసుక, అక్రమ రవాణా చేసే వారికే ప్రాధాన్యాన్ని ఇస్తూ వారు కార్యాలయానికి వస్తే కానీ పనులు చక్క చక్క కొనసాగవు అన్న చందంగా బోధన్ రెవిన్యూ కార్యాలయం మారిపోయింది. రెవెన్యూ అధికారులు ప్రజలకు జవాబుదారీగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కట్టే పన్నులను ప్రభుత్వాలు వసూలు చేస్తూ అధికారులకు జీతభత్యాలను ప్రభుత్వం చెల్లిస్తుందన్న విషయాన్ని అధికారులు గుర్తించడం లేదు. తాము పనులు చేయకపోతే ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్న అపోహలను సృష్టిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవకులుగా పనిచేయాల్సి ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు బోధన్ రెవెన్యూ అధికారులపై విచారణ చేపట్టి ప్రజలకు పనులు జరిగేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular