Tuesday, February 24, 2026

డాక్టర్ మధుశేఖర్ కి సన్మానం

ద్రోణ నిజామాబాద్

ఆర్మూర్ పట్టణంలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ మధు శేఖర్ సారు కు ఎంజే హాస్పటల్లో రజక ఐక్య వేదిక నిజమాబాద్ జిల్లా యువజన కమిటీ అధ్యక్షులు మీర శ్రావణ్ ఆధ్వర్యంలో సన్మానం. ఈ సందర్భంగా మీర శ్రావణ్ మాట్లాడుతూ వైద్యులు – దైవ సమానులనీ ప్రాణాన్ని ఇచ్చింది దేవుడైతే అట్టి ప్రాణాన్ని కాపడేవారు కూడా దైవం తో సమానం అని అన్నారు, డాక్టర్ మధుశేఖర్ చాలా అతి తక్కువ పిజ్ తో వైద్యం చేస్తారని ఎంతో మంది నిరుపేదలకు ఉచితం వైద్యం చేశారని ఎన్నో మెడికల్ క్యాంప్ నిర్వహించారని అలాగే చేయూత ఫౌండేషన్ ద్వారా కూడా అనేక సేవలు చేస్తున్నారని కొనియాడారు.
అలాగే వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మక్లూర్ రాజు, బజమొల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular