ద్రోణ హైదరాబాద్
జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా హైదరాబాద్ లక్డికపూల్, హోటల్ అబోడ్ (శ్రీ వెంకటేశ్వర) హోటల్ లో ఆదివారం సాయంత్రం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యుల దినోత్సవ కార్యక్రమానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మ ఇస్తారన్నారు. బాధలనుంచి, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లు అని ఎంపీ డా.కడియం కావ్య కొనియాడారు. కరోనా క్లిష్ట సమయంలో తాను వైద్యురాలిగా ప్రజలకు అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆరోగ్య విపత్తుల కాలంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని అన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, తెలంగాణను ఆరోగ్య తెలంగాణగా మార్చడమే ధ్యేయంగా, కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కాళీ ప్రసాదరావు, హోనీ. రాష్ట్ర కార్యదర్శి డా. జె. విజయ్ రావు, హోనీ. స్టేట్ ఫిన్. కార్యదర్శి డా. రాజేంద్ర కుమార్ యాదవ్ మరియు ప్రముఖ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
