టివియువి ఆధ్వర్యంలో
ఇంటర్ లో అధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సన్మానం తత్కారాలు అందజేస్తామన్నారు. అకాడమీ ఎక్స్లెన్స్ అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడుతు జిల్లా వ్యాప్తంగా కళాశాల్లలో టాపర్లు నిలిచిన విద్యార్థులకు 4 సంవత్సరాలు గా టివియువి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా నుంచి రాష్ట్రంలో నెం-1 ర్యాంకు సాధించిన అంకిత విద్యార్థిని అభినందించారు. జీవితంలో చదువును మధ్యలో ఆగిపోద్దు. ప్రయాణంలో ఇంటర్ విద్య మొదటి అడుగు. ప్రతి సంవత్సరం ఉన్నత చదువుల్లో ఇలాంటి అవార్డులను తీసుకోవాలని అన్నారు. నిరుద్యోగ సమస్యలు కోసం విద్యార్థులు ఉద్యమాలు చెయ్యాలి తప్ప ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయే విధంగా ఉద్యమాలు చేయవద్దని , నిరుద్యోగ సమస్యలు కోసం ఆమరణ నిరాహారదీక్ష చెస్తున్న మోతిలాల్ దీక్ష విరమణ చేయ్యాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు.
తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ ముదిరాజ్ విద్యార్థులు లక్ష్యాలతో చదివితే విజయం మి స్వతం అవుతుందని అన్నారు .డి.ఐ.ఇ.ఓ రవికుమార్ అవార్డులు తిసుకున్న విద్యార్థులు కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ సుపరిండెట్ ప్రతిమారాజ్, మాట్లాడుతూ మహిళలు జిల్లా లో అధికంగా టాపర్లు గా నిలిచారని అన్నారు. విద్యార్థుల చదువు మధ్యలో డ్రగ్స్ మహమ్మారి తో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సినియర్ అడ్వకెట్ ఆశ నారయణ , టిజెయస్ జిల్లా ఇంఛార్జి లక్ష్మణ్ యాదవ్ టివియువి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ సింగ్, టివియువిజిల్లా ఇంఛార్జి నవీన్ టివియువి ,జిల్లా కన్వీనర్ అజయ్, సుభాష్ సన్నీ,అజయ్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో అవార్డులు అందజేత
RELATED ARTICLES
