Tuesday, February 24, 2026

అదిలాబాద్ జిల్లా లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతి రాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క

అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లోని రామలింగం పల్లి గ్రామం నుండి శ్యామ్ నాయక్ తాండ వరకు 375.00 లక్షల రూపాయల వ్యయం తో నిర్మించిన తారు రోడ్డు, బ్రిడ్జి ప్రారంభోత్సవం

కోటి రూపాయలతో నిర్మించనున్న ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం ను స్మృతివనం నిర్మాణానికి భూమి పూజ

మావల అర్బన్ పార్క్ లో వనమహోత్సవ కార్యక్రమం లో మొక్కలు నాటిన మంత్రి

వాచ్ టవర్ పరిశీలన

డిస్ట్రిక్ట్ డిజస్టార్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభోత్సవం

వికలాంగులకు సహకార ఉపకరణాలు పంపిణీ

జిల్లా అధికారులతో సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు పై సమీక్ష సమావేశం

ద్రోణ ఆదిలాబాద్ జూన్ 1

సోమవారం అదిలాబాద్ జిల్లా లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతి రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ , మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్ ,జిల్లా పాలనాధికారి రాజర్షి షా, జిల్లా సూపరెండెంట్ ఆఫ్ పోలీస్ గౌస్ ఆలం, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, అదిలాబాద్ , ఖానాపూర్ శాసన సభ్యులు పాయల్ శంకర్, వెడ్మ
బొజ్జు, తదితరులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముందుగా
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రామలింగంపల్లి గ్రామం నుండి శ్యామ్ నాయక్ తాండ వరకు రూ .3 కోట్ల 75 లక్షల వ్యయం తో చేపట్టిన తారు రోడ్డు, వాగు పై నిర్మించిన వంతెనను ప్రారంభించారు. ఏజెన్సీ పరిధిలోని గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతి గూడాని కి రహదారి సౌకర్యం కల్పించి వారి సమస్యలు తీరుస్తామని మంత్రి ఆన్నారు.
అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి కోటి రూపాయల వ్యయంతో స్మృతి వనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
జిల్లాలో పచ్చదనానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆన్నారు.మావల అర్బన్ పార్క్ లో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటి వన మహోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. వనం బాగుంటే జనం బాగుంటారని, ఆరోగ్యం, ఆనందం ఉంటుందని, అందుకే మొక్కలను నాటాలని ఆన్నారు.
అదిలాబాద్ పట్టణం నకు అర్బన్ పార్క్ 1500 ఎకరాలలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.మావల పార్కు నందు జిల్లా విపత్తు నిర్వహణ బృందం డిడిఆర్ఎఫ్ (డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) ను రాష్ట్ర పంచాయతీరాజ్ ,రూరల్ డెవలప్మెంట్ మంత్రి సీతక్క ప్రారంభించారు.ఈ డిడి ఆర్ఎఫ్ నందు ఒక రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సారథ్యంలో 20 మంది సిబ్బంది హైదరాబాదు నందు ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ , డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా వారం రోజులపాటు శిక్షణ తీసుకొని జిల్లాలో ఎలాంటి ఆపత్కాల సమయంలో విపత్తులు జరిగినప్పుడు అత్యవసరంగా స్పందించేందుకు జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ప్రత్యేక చొరవతో ప్రారంభించడం జరిగిందన్నారు. జిల్లాలో వరదలు సంభవించినప్పుడు, ఇల్లు కూలిపోయినప్పుడు, ఎలాంటి తుఫానులు, సుడిగాలులు సంభవించి రోడ్లు
స్థంభించిపోయినప్పుడు చెట్లు పడిపోయినప్పుడు ఈ బృందం వెంటనే స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాపాడుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా డిడిఆర్ఎఫ్ బృందానికి సంబంధించినటువంటి రెస్క్యూబోట్, మోటర్ మిషన్స్, మెడికల్ స్ట్రక్చర్స్, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, వుడ్ కట్టర్ మిషన్స్ వాటిని ప్రారంభించడం జరిగింది.
జిల్లాలో ఎలాంటి ఆపత్కాల సమయంలోనైనా ప్రజలను త్వరగా కాపాడే విధంగా, ప్రాణ నష్టం వాటిల్లకుండా జిల్లాలో సొంతంగా డిడిఆర్ఎఫ్ (డిస్టిక్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) పోలీసు సిబ్బంది ద్వారా ఏర్పాటు చేయడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు.
జిల్లాలో డి డి ఆర్ ఎఫ్ నిర్వహిస్తున్న 20 మంది పోలీసు సిబ్బంది అందరికీ అభినందనలు తెలియజేశారు. ప్రమాదాల నుండి ప్రజలను కాపాడటమే మీ లక్ష్యంగా విధులను నిర్వర్తించాలని అదేవిధంగా మీ ప్రాణాలను కాపాడుకుంటూ ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ, చాకచక్యంగా ఆలోచిస్తూ, బృందంలో ఒకరితో ఒకరు కలిసికట్టుగా విధులను నిర్వర్తిస్తూ విపత్తులలో శిక్షణను దృష్టిలో ఉంచుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular