Tuesday, February 24, 2026

వైద్యులు ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలి

వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనదని వైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరు సేవా భావంతో కూడిన వైద్యాన్ని రోగులకు అందించి సమాజంలో వైద్యులకున్న ప్రత్యేక స్థానాన్ని పదులపరుచుకోవాలని డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి పిలుపునిచ్చారు. డాక్టర్స్ డే ను పురస్కరించుకొని బోధన్ జర్నలిస్టులు వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ సునీల్ కుమార్ చౌదరి ను ఘనంగా సన్మానించారు.

ఎంతోమంది పేదలకు ఉచితంగాను, అతి తక్కువ ఫీజుతో వైద్య సేవలు అందిస్తూ ఒక్కో సందర్భంలో మందులను సైతం ఎంతోమంది పేదలకు ఉచితంగా అందిస్తూ వచ్చిన డాక్టర్ సునీల్ కుమార్ ను జర్నలిస్టులు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ వైద్యవృత్తి లో ఉన్నవారు సేవాభావంగా మెలుగుతూ వైద్య సేవలను అందించి ప్రజల్లో ప్రత్యేక స్థానాన్ని పదిలపర్చు కోవాలన్నారు. తాను బోధన్ లో 35 ఏళ్లుగా వైద్య సేవలు అందిస్తూ సమాజంలో తాను ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవడం జరిగిందన్నారు. తల్లులు పిల్లలకు జన్మనిస్తారు. ప్రజలు అనారోగ్యానికి గురై ప్రమాదంలో ఉన్నప్పుడు వైద్యులు రోగి జబ్బు నయం కావడమే లక్ష్యంగా భావిస్తూ వైద్య సేవలు అందిస్తూ ఉంటారని అన్నారు. తల్లులు జన్మనిస్తే వైద్యులు ఎంతోమంది ఆపదలో ఉన్న ఉన్నవారికి పునర్జన్మను ఇవ్వగలుగుతామన్నారు.

సమాజంలో వైద్యులకు ఎంతో ప్రత్యేక స్థానం ఉందని వైద్యులకు సమాజంలో ఉన్న గుర్తింపును మరింత పెంపొందించేందుకు వైద్య వృత్తిలో ఉన్నవారు కృషి చేయాల్సి ఉందన్నారు. అనారోగ్యానికి గురై తమ వద్దకు వచ్చే రోగులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వైద్య సేవలు అందించడంతోపాటు వారికి ఉన్న రోగాన్ని నిర్ధారించుకోవాలి. రోగికి ఉన్న జబ్బులను బహిర్గతం చేయకూడదన్నారు. అనారోగ్యానికి గురైన మరియు వారి బంధువులకు మాత్రమే రోగ వివరాలు తెలపాలన్నారు. వైద్యాన్ని కొంతమంది బడాబాబులు సమాజంలోకి చొచ్చుకొని వచ్చి డబ్బు సంపాదనే ధ్యేయంగా భావిస్తూ కార్పొరేట్ హాస్పిటల్ లను స్థాపించి రోగులకు వైద్య సేవలను అందిస్తూ మరోపక్క డబ్బు పెద్ద ఎత్తున గుంజడం సరైన పద్ధతి కాదన్నారు. కార్పొరేట్ వ్యవస్థలతో వైద్య వృత్తికి ఎంతో కళంకం కలుగుతుందన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి తాము తీసుకునే ఆహారపు అలవాట్లను అనుకూలంగా మార్చుకోవాలని డాక్టర్ సునీల్ కుమార్ సూచించారు. 90 శాతం వ్యాధులను ఆహారపు అలవాట్లతో దూరం చేసుకునే వీలుందన్నారు. హోటళ్లల్లో, దాబాల్లో ఆహార పదార్థాల్లో ఎన్నో రకాలైన హానికరమైన రసాయనాలను వాడుతున్నారని, అటువంటి ప్రమాదకరమైన ఆహారాన్ని తీసుకోవడాన్ని దూరం చేసుకోవాలన్నారు.

బోధన్ జర్నలిస్టులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తా

జర్నలిస్టుల వృత్తి ధర్మం ఎంతో పవిత్రమైనదని, ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలుగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిజమే పరిష్కార మార్గం చూపిస్తుందన్నారు. బోధన్ జర్నలిస్టులకు తాను ఉచితంగా వైద్య సేవలను అందిస్తానని, జర్నలిస్టులు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తనను సంప్రదించాలని కోరారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఉచితంగా అందించి వారి సేవలకు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతోమంది జర్నలిస్టులు తమ జీవితాలను పణంగా పెట్టి జర్నలిజంలో కాలం వెళ్ళదిస్తున్నారని అటువంటి వారికి ప్రభుత్వం గౌరవేతనాన్ని అందించి వారికి మరింత గౌరవాన్ని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోధన్ జర్నలిస్టులు, కనకమెడల శ్రీనివాసరావు (వాసు), జర్నలిజమే పరమావధిగా భావించే సీనియర్ జర్నలిస్ట్ సాంబశివరావు చౌదరి, కృష్ణ, నాగరాజు, ఉమాకాంత్, జగన్, శ్రీనివాస్, నాగేశ్వరరావు, శివకుమార్, కాంగ్రెస్ పార్టీ ఉట్పల్లి నాయకులు టప్ప సాయిలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular