Tuesday, February 24, 2026

పెన్షన్ ల పంపిణీలో చేతివాటం

సచివాలయ ఉద్యోగి సస్పెండ్

ద్రోణ మాచర్ల

ఏపీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం పండగలా సాగుతోంది. మాట ఇచ్చిన ప్రకారం బకాయిలతో కలిపి పెంచిన పెన్షన్ అందజేస్తున్న చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు లబ్ధిదారులు.
అయితే పెన్షన్ల పంపిణీ విషయంలో సిబ్బంది ఎవరైనా చేతివాటం ప్రదర్శిస్తే వెంటనే వేటు పడుతుందని ప్రభుత్వం ప్రత్యక్ష వార్నింగ్ ఇచ్చింది.
ప్రభుత్వ ఖజానా నుంచి వేలకు వేలు జీతం తీసుకుంటున్నా ఓ ఉద్యోగి బుద్ధి మారలేదు. ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తూ వృద్ధుల దగ్గర నుంచి 500 చొప్పున వసూలు చేశాడు. ఇప్పుడా విషయం బయటపడడంతో చివరికి సస్పెన్షన్‌కి గురయ్యాడు. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిందీ ఘటన. ఓ సచివాలయ ఉద్యోగిని విచారణ తర్వాత ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. పెన్షనర్ల దగ్గర రూ.500 చొప్పున వసూలు చేశాడని ఆరోపణపై వెంటనే విచారణ జరిపి నిర్ణయం తీసుకున్నారు. బాలునాయక్‌పై బాధితులు ఫిర్యాదుతో అతన్ని సస్పెండ్ చేసినట్టు చెప్పారు మున్సిపల్ కమిషనర్‌. మాచర్లలోని 9వ వార్డు సచివాలయంలో ఈ ఘటన జరిగింది. వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ మూడవత్ బాలు నాయక్ ఇప్పుడు వృద్ధుల పెన్షన్ డబ్బుల నుంచి ఐదేసి వందలు తీసుకుని ఉద్యోగం పోగొట్టుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular