చేసిన పనులకు బిల్లులు రాక..! తెచ్చిన అప్పులు తీర్చలేక
పదవి పోయింది పరువుపోతుంది అనే మానసిక ఆందోళనతో
గత కొద్దిరోజులుగా ఘర్షణ పడుతున్న మహబూబాబాద్ మండలం తూర్పుతండ సర్పంచ్ భర్త కృష్ణ(38)
ద్రోణ హైదరాబాద్
సర్పంచ్ పదవికాలంలో అప్పులు చేసి, ఉన్న ఆస్తులు అమ్మి చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో, అనవసరంగా బార్యను సర్పంచ్ పోటీలో దింపి అప్పులపాలై తన..పిల్లలకు అన్యాయం చేసానంటూ ఇద్దరు పసిపిల్లలను పట్టుకొని బోరున విలపించిన కృష్ణ.
అదే ఆవేదనతో ఆదివారం మానసిక ఆందోళనతో అపస్మారకస్థితికి చేరుకున్న కృష్ణ ను హుటాహుటిన మహబూబాబాద్ తరలించిన కుటుంబసభ్యులు., పరిస్థితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలింపు.
చికిత్స పొందుతూ 38 సంవత్సరాల వయస్సులోనే మృతిచెందిన కృష్ణ. అనాధలుగా మారిన కుటుంబం.సర్పంచ్ పదవిలో ఉండగా చేసిన పనులకు బిల్లులు రాక.. అప్పులు చేసినవారికి ఎలా సమాదానం చెప్పాలో అర్ధంకాక మానసిక ఆందోళనతోనే కృష్ణ మృతిచెందాడంటూ బోరున విలపిస్తున్న కుటుంబసభ్యులు, బందువులు, తండావాసులు.
