పార్లమెంట్ సాక్షిగా హిందువులను కించపర్చిన రాహుల్
కాంగ్రెస్ విధానం మొదటి నుండి హిందువులకు వ్యతిరేకం
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు–నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి
పార్లమెంట్ సమావేశాలలో హిందువులను కించపర్చిన రాహుల్ గాంధీ తీరుపై *బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి స్పందించారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ హిందువు అని చెప్పుకునేవారు,హిందుత్వం కోసం పని చేసే వారు హింస ను మరియు అసత్యాన్ని మాట్లాడుతారని అన్నాడు, దీన్ని శ్రీవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.భారత దేశం ఎప్పుడూ కూడ ఎవరిపై దాడులు చేయలేదని,మతాలకు సంబందించిన వ్యక్తుల యొక్క దాడులను తట్టుకొని ఈ దేశం నిలబడిందని అన్నారు.
ఈ దేశం ఎప్పుడూ అక్రమాలు చేయలేదని ,హింస ను ప్రేరేపించలేదని ప్రపంచమంతా ఒక్కటేనని చెప్పే ధర్మం హిందుత్వమని అన్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాల కోసం రాహుల్ గాంధీ కాంగ్రెస్ యొక్క మనస్తత్వాన్ని ,అలోచన విధానాన్ని బయటపెట్టాడని అన్నారు.దేశంలోని హిందువులందరూ దీన్ని గమనించాలని,వీటిని తీవ్రంగా ఖండించాలని,కాంగ్రెస్ పార్టీ అలోచన విధానం దేశానికి ఎంతో ప్రమాదకరమని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అలోచన విధానం మానుకోవాలని శ్రీవర్ధన్ రెడ్డి డిమాండ్ చేసారు.
