Wednesday, February 25, 2026

విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కావద్దు

ద్రోణ హైదరాబాద్

తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని…. మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే సాంఘిక సంక్షేమ పాఠశాల లో గంజాయి మరియు మత్తు పదార్దాల నిర్మూలన, సైబర్ క్రైమ్స్, ఆత్మహత్యలపై అవగాహన సదస్సు

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి… యువత ఆన్లైన్ గేమ్స్ మరియు ఆన్లైన్ లోన్ ల పట్ల జాగ్రత్త*
తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే సాంఘిక సంక్షేమ పాఠశాల
లో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ IPS.,[IG] ఆదేశాల మేరకు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో“గంజాయి మరియు మత్తు పదార్దాల నియంత్రణ, సైబర్ క్రైమ్స్ ఆత్మహత్యల పై” అవగాహనా సదస్సు కార్యక్రమం నిర్వహి౦చారు. ఈ సందర్బంగా సీఐ కుమారస్వామి మాట్లాడుతూ….. యువత చెడు వ్యసనాలకు అలవాటు చట్ట వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతూ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని అన్నారు.
చుట్టుపక్కల గాని మీ గ్రామంలో కానీ ఎవరైన గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా గమనిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు, సమాచారం అంధించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని, కావున గంజాయి రహిత ప్రాంతంగా గుర్తింపబడటంలో ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు.
యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా వారి భవిష్యత్తు దృష్యా మత్తు పదార్థాల సరఫరా, ఉత్పత్తి చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపి వారి మీద కేసులు పెట్టడంతోపాటు సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని సిఐ గారు హెచ్చరించారు.ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు పెరుగుతుండటంతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని, తల్లిదండ్రుల, పరీక్షలు ముగిసిన తరువాత తమ ఇంటికి వెళ్ళాక చుట్టూ ప్రక్కల వారికి, మీ గ్రామంలలో కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు.ప్రస్తుత కాలంలో చిన్న చిన్న విషయాలకే తీవ్ర వత్తిడి లో క్షణిక ఆవేశం లో మనిషి తనను తాను కంట్రోల్ చేసుకోలేక చనిపోవాలని నిర్ణయం తీసుకుంటారు కానీ తర్వాత తన కుటుంబ సభ్యులు ఎంత బాధ పడేది అర్థం చేసుకోలేరు అని అన్నారు. ఎలాంటి సమస్యనైనా దైర్యంగా ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితం నాశనం చేసుకోవద్దు అన్నారు. ఇప్పుడు పడినటువంటి ప్రభుత్వ పోలీసు ఉద్యోగాలు సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని, చట్ట వ్యతిరేకమైన పనులు చేసి కేసులు నమోదు ఐనట్లయితే ఎలాంటి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బంది పడవలసి వస్తుంది అని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular