ద్రోణ కామారెడ్డి
పది ఎకరాల లోపు ఉన్న వారికి అది కూడా సాగు చేస్తున్న వారికి మాత్రమే రైతుబంధు అందించాలని ఏకగ్రీవ తీర్మానం
గతంలో కాంగ్రెస్ పార్టీ అందించినట్టు వ్యవసాయ పనిముట్లు సబ్సిడీతో కూడిన యంత్రాలు అందించాలి
కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం
కామారెడ్డి నియోజకవర్గం లోని బిక్నూర్ మండల ఎంపీపీ కార్యాలయంలో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, వైద్యాధికారులు విద్యాధికారులు విద్యుత్ అధికారులతో ఎంపీపీ గాల్ రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలి షబ్బీర్ మాట్లాడుతూ రైతుబంధు10 ఎకరాల లోపు ఉన్నవారికి వ్యవసాయం చేస్తున్న వారికి ఇవ్వాలని రైతుబంధు పై రాష్ట్రంలోనే మొదటిసారిగా కామారెడ్డి నియోజక వర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేసిన రెండవ మండల పరిషత్ ప్రజా ప్రతినిధులకు నాయకులకు ధన్యవాదాలు.ప్రైవేట్ విద్యాలయాల్లో ఫీజులపై మరియు ప్రభుత్వం నిబంధనలను
పాటించని పాఠశాలలపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.ప్రభుత్వ విద్యాలయాలు మరమ్మతులు చేయాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది వాటిని వెంటనే పూర్తి చేయాలి అన్నారు. అందరికీ సకాలంలో బుక్స్, డ్రెస్ లు అందించాలన్నారు.ఏ ఒక్క గ్రామంలో కూడా నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఏ గ్రామంలో అయితే నీటి ఎద్దడి ఉందో అక్కడ నీటి ట్యాంకర్లు పెట్టి నీటిని అందించాలన్నారు.
రైతులకు విత్తనాలు మరియు ఎరువులు కొరత లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా భిక్నూరు మండల పరిషత్ సమావేశం ఇదే చివరి మండల సమావేశమైనందున ఎంపీటీసీలను ఎంపీపీలను సన్మానించారు.ప్రజలకు మంచి సేవ చేసి ప్రజల మధ్యలో ఉన్నవారు తిరిగి ప్రజాప్రతినిదులు ఎన్నికై వస్తారన్నారు.
